ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య..!!

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(52)ది సహజ మరణం కాదు. ఆత్మహత్య గా తెలుస్తోంది. తొలుత ఉమా మహేశ్వరి గుండె పోటుతో మరణించినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్దారణ అయింది. ఈ ఉదయం వరకు బాగానే ఉన్న ఉమా మహేశ్వరి సడన్ గా పడిపోవటంతో కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారని భావించారు. దీంతో.. పోలీసులు అనుమానాస్పద మరణం కేసుగా కేసు నమోదు చేసారు.

ఉరి వేసుకొని ఆత్మహత్య..!
అయితే, సహజ మరణం కాదని..తన చున్నీతో ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయారని తెలుస్తోంది. మానసిక ఒత్తిడి..అనారోగ్య సమస్యల కారణంగానే ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. తన సోదరి మరణ వార్త తెలిసిన వెంటనే సినీ హీరో బాలయ్య సోదరి ఇంటికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేష్.. నందమూరి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అయితే, ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసి నిర్ఘాంతపోయారు

మానసిక ఒత్తిడి.. అనారోగ్యం కారణాలుగా
ఉదయం భర్తను టిఫిన్ చేయమని చెప్పి గదిలోకి వెళ్లిన ఉమా మహేశ్వరి..ఆ తరువాత గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఊహించని పరిణామం తో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. భర్త టిఫిన్ తీసుకొచ్చే సమయంలో లోపలకు వెళ్లి తలుపుకు బోల్ట్ పెట్టుకున్న ఉమా మహేశ్వరి ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. సహజ మరణం కాకపోవటంతో ఉమామహేశ్వరి శ‌వాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల పైన పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం జరుగుతోంది.

అనుమానాస్పద మరణంగా విచారణ
ఉమా మహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విదేశాల్లోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే, ఇప్పుడు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. ఆమె మరణాన్ని అనుమానాస్పద మరణంగా పోలీసులు విచారణ ప్రారంభించటంతో నిజా నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like