మా సమస్యలు పరిష్కరించండి
డైరెక్టర్(పా)కు వినతిపత్రం అందించిన మైనింగ్ సిబ్బంది
ఎన్నో రోజులుగా పెండింగ్‌లో తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి మైనింగ్ స్టాఫ్ డైరెక్టర్ (పా) బలరాంనాయక్‌కు విజ్ఞప్తి చేశారు. మందమర్రి ఏరియా లో నిర్వహించిన Grievance day సందర్భంగా మైనింగ్ సిబ్బంది తమ సమస్యల గురించి డైరెక్టర్ బలరాం నాయక్ కు వినతిపత్రం అందించారు. అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయితే సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఓవర్‌మెన్లకు అండర్‌మేనేజర్లుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పలు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని డైరెక్టర్(పా)కు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్ కుమార్, జీఎం కమిటీ సభ్యులు సీవీ.రమణ, శంకర్‌రావు, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జీ పెండ్రి రాజిరెడ్డి, ఆసం శంకర్, వై. పవన్ కుమార్, ఆర్. శ్యామ్, సాయి వివేక్, ఓవర్ మేన్స్ కృష్ణచారి, గుర్రం కిరణ్ పాల్గొన్నారు.