భార్య ఆత్మహత్య.. కాపాడబోయి భర్త మృతి
కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడబోయి భర్త మృతి చెందిన ఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పాలే సంతోష్, ఆయన భార్య మంగ తరచూ గొడవ పడుతుండేవారు. జీవితం పై విరక్తి చెందిన భార్య మంగ గూడెం సమీపంలోని ప్రోక్లైన్ తో తోడిన గుంత వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన సంతోష్ భార్య ను రక్షించే ప్రయత్నం లో అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.
గ్రామస్తుల సమాచారం అందించడంతో చింతల మానే పల్లి ఎస్సై విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ ఈత గాళ్ళ సహాయంతో బయటకు తీశారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్సె విజయ్ కుమార్ తెలిపారు. వారికి చరణ్ 8, శరణ్య 6 ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలయ్యారు.