కరంటు వచ్చిందోచ్..

ఎట్టకేలకు బాసర ట్రిపుల్ ఐటీకి ఎట్టకేలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. సోమవారం ఉదయం తొమ్మది గంటలకు ట్రిపుల్ ఐటీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు సోలార్ విద్యుత్‌కు సంబంధించి సైతం సరఫరా కాలేదు. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. మంగళవారం పరీక్షలు ఉండటంతో కొందరు విద్యార్థులు సెల్‌ఫోన్ వెలుగులోనే విద్యార్థులు చదువుకున్నారు. ఉదయం స్నానాలు చేసేందుకు నీళ్లు లేక వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధికారులు విద్యుత్ పునరుద్దణకు సంబంధించి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి.
దీంతో హైదరాబాద్, కోల్‌కత్త నుండి అవసరమైన విడిభాగాలను తెప్పించడంతో పాటు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం సాయంత్రానికి ఈ పని పూర్తైంది. RGUKT లో విద్యుత్తు కేబుల్‌లు దెబ్బతిన్న కారణంగా విద్యుత్తు అంతరాయం కలిగిందని అధికారులు స్పష్టం చేశారు. RGUKT ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట రమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, అధికారుల అవిశ్రాంత ప్రయత్నాలతో సమస్యను సాధారణ స్థితికి తీసుకువచ్చారని వారు చెప్పారు. మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని, విడిభాగాలు, సంబంధిత పరికరాలు నిల్వ చేసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.