కొట్టి.. ఇంటినుండి వెల్లగొట్టి..

-ఆడపిల్లలు పుట్టారని అగ్రహం
-చిన్నారిని చంపే ప్రయత్నం
-త‌న‌కు న్యాయం చేయాల‌ని వివాహిత వేడుకోలు
-భ‌ర్త ఇంటి ఎదుట మ‌హిళ న్యాయ‌పోరాటం

కట్టుకున్న భార్యను, పుట్టిన వికలాంగురాలైన కూతురుని బయటికి వెల్లగొట్టిన ఉదంతం పాత మంచిర్యాల లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాసిపేట మండలం దేవపూర్ కు చెందిన మౌనిక కు పాతమంచిర్యాల కు గొల్లపల్లి తిరుపతి కు 10 సంవత్సరాల కిందట వివాహం అయింది. అప్పుడు కట్నం కింద 3 లక్షలు,
8 తులాల బంగారం ఇచ్చారు. కొద్ది రోజుల బాగానే ఉన్న తిరుపతి అదనపు కట్నం కోసం వేదించేవాడు. తాగివచ్చి నిత్యం కొట్టేవాడు. ఇద్దరు అడపిలల్లే కావడంతో మౌనిక కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి.

మగపిల్లాడు కావాలని శారీరకంగా, మానసికంగా విపరీతంగా వేధించడం మొదలు పెట్టారు. దీనికి తోడు అత్త, మామ సైతం వేదింపులకు గురిచేయడంతో మౌనిక పుట్టింటికి వెళ్ళింది.

కొద్దిరోజుల కిందట మళ్ళీ పాత మంచిర్యాల అత్తగారింటికి వచ్చింది. అయినా ఆమె కష్టాలు తీరలేదు. భర్త మళ్ళీ తాగి వచ్చి కొట్టడంతో పాటు, గురువారం సాయంత్రం చిన్న పాప శౌర్యను చంపే ప్రయత్నం చేసాడు. గదిలో వేసి పాపను విపరీతంగా కొట్టాడు. దీంతో మౌనిక పాపను తీసుకుని బయటకు పరిగెత్తింది.

ఇంట్లో ఉండొద్దు అని బయటకు వెళ్లాల‌ని భర్తతో పాటు మామ రాంచందర్, అత్త శంకరమ్మ వేధిస్తున్నార‌ని మౌనిక ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న‌కు త‌న పిల్ల‌ల‌కు పోలీసులు, గ్రామ పెద్ద‌లు న్యాయం చేయాల‌ని ఆమె కోరుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like