కుంగిన బ్రిడ్జ్.. నిలిచిన రాకపోకలు

భారీ వర్షాలు, వరదల నేపద్యంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజాగా బ్రిడ్జి కుంగిన ఘటనలో ఆ ప్రాంతానికి రవాణా నిలిపివేశారు అధికారులు. కొమురం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ వరద ప్రవహాంతో కుంగిపోయింది. దీంతో కాగజ్నగర్, దహెగాం మధ్య రాకపోకలు నిలిపివేశారు. రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు వెళ్లకుండ చూస్తున్నారు. కనీసం పాద చారులను సైతం అనుమతించడం లేదు.
అందవెల్లి దగ్గర బ్రిడ్జి పూర్తిగా కుంగిపోవడంతో రాకపోకలు నిషేధించామని కాగజ్ నగర్ వెళ్ళేవాళ్ళు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని దహెగాం తహసీల్దార్ విజ్ఞప్తి చేసారు. ఇక మండల బయటికి వెళ్లాలంటే బెల్లంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.