సింగరేణి కార్మికుడి హత్య
తుపాకీతో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ సింగరేణి కార్మికుడిని తుపాకితో కాల్చిచంపారు. గంగానగర్ లో నివాసముండే కోరుకొప్పుల రాజేందర్ ను తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న రాజేందర్ ను తలపై కణతి భాగంలో తుపాకీతో కాల్చిచంపారు. భార్య రవళి బాత్రురూం కు వెళ్లి వచ్చే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మృతుడు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కె న్యూటెక్ సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్, గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు తుపాకీతో కాల్చి చంపినట్లు డీసీపీ వెల్లడించారు. ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాలు సేకరించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రూపేష్ తెలిపారు