హరితహారం మొక్కలు దగ్ధం
చెన్నూరు మండలం పొన్నారం బీట్ పరిధిలో హరితహారంలో భాగంగా నాటాల్సిన మొక్కలు కొందరు గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని వీటిని ధ్వంసం చేయడమే కాకుండా, మొక్కలపై వరిగడ్డి వేసి మంటలో కాల్చేశారు. ఈ మేరకు అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి వెల్లడించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం నిర్వహించాలని ఆదేశించింది. దీంతో శనివారం సాయంత్రం పొన్నారం బీట్ పరిధిలో అటవీశాఖ అధికారులు మొక్కలు తెచ్చిపెట్టారు. అయితే కొందరు గ్రామస్తులు వాటిని ధ్వంసం చేసి, మంటపెట్టి తగలపెట్టారు. చాకేపల్లి గ్రామానికి చెందిన దుర్గం రవి, కొందరు గ్రామస్తుల సహాయంతో ఈ పనిచేసినట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తుంటే కొందరు అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారని వెల్లడించారు. వీరిపై కేసు నమోదుఉ చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెల్లడించారు.