బట్టకాల్చి మీద వేస్తున్నారు
-ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకెలాంటి సంబంధం లేదు
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్ బిడ్డని కాబట్టి నన్ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్ బిడ్డ కదా అని ఆరోపణలు చేస్తే కేసీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారని వారి ఉద్దేశమని బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా బీజేపీ నాపై ఆరోపణలు చేస్తోందని అన్నారు.
నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్య పరిణామం కాదని కవిత స్పష్టం చేశారు. దర్యాప్తునకు సహకరిస్తానని ఆన్నారు. కేంద్రం పై పోరాటంలో వెనక్కి తక్కేది లేదని వెల్లడించారు. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయని అన్నారు. ఉద్యమం సమయంలో అనేక ఆరోపణలు చేశారు అయిన మొక్కవోని దైర్యం ముందుకు వెళ్ళామని గుర్తు చేశారు. బిల్కిస్ బాను, ఉద్యోగాల గురించి అడిగాము, అడుగుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.