రాజకీయంగా ఎదుర్కోలేకనే కవితపై అసత్య ఆరోపణలు
TBGKS ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి

TBGKS General Secretary Miryala Rajireddy is angry with the Centre
రాజకీయంగా ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ, TBGKS గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం RG2 ఏరియా లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బిజెపి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను రాష్ట్ర ప్రజలతోపాటు సింగరేణి కార్మిక లోకమంతా ముక్తకంఠంతో ఖండిస్తోందని తెలిపారు.
కొంతమంది బిజెపి నాయకులు పనిగట్టుకొని తెలంగాణ రాష్ట్రంతో పాటు టిఆర్ఎస్ పార్టీ పైన విషం చిమ్ముతున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఉద్యమ సారథి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు ఎలాగైనా కేసీఆర్ ని గద్ద దింపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో పోటీ పడలేక కవిత పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు తన పనికి, సేవా కార్యక్రమాలకు అనేక అవార్డులతో పాటు ప్రశంసలు వెళ్తాయని పార్లమెంట్ సాక్షిగా బిజెపి నాయకులే కవిత ను మెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గుర్తించారని చెప్పారు. అలాంటి కవితని కేవలం కక్షపూరిత వైఖరితోనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు.
ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాలను డబ్బు, అధికార అహంతో కుల దోశాయని అన్నారు. తెలంగాణలో కూడా అధికారం కోసం ఇలాంటి ఈడీ సీబీఐ కేసులంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కానీ ఇక్కడ ఈడీలు, బోడీలకు భయపడే నాయకులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు వారి తీరు మార్చుకోకపోతే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని తెలిపారు. ఆర్జీటు వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిట్ కమిటీ, ఏరియా కమిటీ, కేంద్ర కమిటీ, జిఎం కమిటీ, మైన్స్, సేఫ్టీ కమిటీ టెంపుల్ కమిటీ తో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.