డిప్లొమా చేసి.. దొంగగా మారి…
-దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
-26 తులాల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
Mancharyala police arrested the person who committed the theft: డిప్లొమా పూర్తి చేశాడు.. మెకానిక్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బుల కోసం దొంగగా మారాడు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
మలిపొర ప్రసన్నాచారి (24) మంచిర్యాల ACC సుభాష్‌నగర్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 17న తన వదిన దివ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో దానిని పగలగొట్టి బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, వెండి సామగ్రి చోరీ చేశాడు. దానిని అమ్మేందుకు బుధవారం వాటిని బంగారం షాపులో అమ్మేందుకు వెళ్లాడు. అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించారు. నిందితుడు ప్రసన్నాచారి వద్ద 26 తులాల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. .
నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీ చేసిన సీఐ B.నారాయణ, ఎస్ఐలు తహసీదుద్దీన్, బి.అంజయ్య, సీసీఎస్ ఎస్ఐ A.కొమురయ్య, కానిస్టేబుళ్లు బి.దివాకర్, A.సత్తయ్య, G.సతీష్, శ్రీనివాస్ ను మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అభినందించి రివార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటికి తాళం వేసి వెళ్లేప్పుడు పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో ఇంటి ముందు CC కెమెరాలు పెట్టుకోవాలిసిందిగా కోరారు.