ఆరుగురు రైతులపై పిడుగు
-ఒకరి మృతి
-మరో ఐదుగురికి గాయాలు
-మృతుని కుటుంబాన్ని ఓదార్చిన కోనేరు
-ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
Thunder strikes six farmers: రాత్రి చేనుకు కాపలాకు వెళ్లిన ఆరుగురు రైతులపై పిడుగు పడింది. దీంతో ఒక రైతు అక్కడిక్కడే మృతి చెందగా, మిగతా వారు గాయపడ్డారు.
అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఆరేగూడ గ్రామంలో నివాసం ఉంటున్న 8 మంది రైతులు పందుల బెడద అధికంగా ఉండడంవల్ల మోసం-ఆరెగూడ గ్రామాల మధ్య పత్తి చేలలో కాపు కాచేందుకు వెళ్లారు. ఇద్దరు రైతులు ఒకచోట, మరో ఆరుగురు రైతులు ఇంకోచోట చేలల్లో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి 12-30 సమయంలో వర్షంతో పాటు పిడుగు పడడంతో ఆరుగురిలో మోహన్ రావు అనే రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మిగతా ఐదుగురికి గాయాలయ్యాయి. చనిపోయిన మోహన్ రావు మోసం ఎంపిటిసి సభ్యురాలు భీమన్ కార్ శోభ భర్త మానేపల్లి కృష్ణ, రోహిణి రాజేందర్, ఎల్ములే రవి కి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరిని ఈస్గాం లోని రేణుక – సమీరన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే, జడ్పీ వైస్ చైర్మన్..
పిడుగు పడిన ఘటనలో మరణించిన ఎంపిటిసి బిమాన్ కార్ శోభ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ పరామర్శించారు. మోహన్ రావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పిడుగుపాటుతో తీవ్ర గాయాలపాలై ఈజ్ గాం లోని రేణుక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.