గనిలో గుండెపోటు.. కార్మికుడి మృతి
Singareni worker died of heart attack in mine: సింగరేణి గనిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుడికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. కాసిపేట 1 గనిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుడు మార్త రమేష్ ఉదయం షిఫ్టులో విధులు నిర్వహిస్తున్నాడు. చాతీలో నొప్పి రావడంతో తోటి కార్మికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. మొదట కేకే 1 డిస్పెన్సరీ తీసుకువెళ్లగా, అక్కడి నుంచి బీజోన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్న సమయంలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ జనరల్ మజ్దూర్ ఇంజనీరింగ్ విభాగంలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.