రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. 8 ట్రక్కులకు నిప్పు పెట్టిన స్థానికులు

Woman dies in road accident. Locals set fire to 8 trucks: టిప్పర్ ఢీకొని ఒక మహిళ మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఏకంగా ఎనిమిది ట్రక్కులకు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలోని శాంతిగ్రామ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.. అహేరి తాలుకా సూర్జాఘడ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ ఓర్ తరలించే టిప్పర్ బైక్ పై వెల్తున్న ఇద్దరిని ఢీ కొట్టడంతో శాంతిగ్రామ్ కు చెందిన బిజోలి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రంహించిన స్థానికులు సూర్జాఘడ్ మైనింగ్ ఫ్యాక్టరీకి చెందిన 8 ట్రక్కులకు నిప్పుపెట్టారు. ఐరన్ ఓర్ తరలిస్తున్న ఈ 8 వాహనాలకు నిప్పుపెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ సంఖ్యలో జనం తరలి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఐరన్ ఒర్ తరలించే లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండటం స్థానికుల ఆగ్రహానికి కారణం అయిందని పలువురు చెబుతున్నారు.