కేసీఆర్ వచ్చాకే సింగరేణిలో వెలుగులు

-ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతి
-ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్

సింగరేణి సంస్థ 2021-22 సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను, ఉద్యోగులకు దసరా కానుకగా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి కార్మికుల పక్షాన, ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రోత్సాహకాన్ని దసరా పండుగ లోపు చెల్లించాలని సింగరేణి C&MD శ్రీధర్ కి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగరావు ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు.

ఈ మేరకు సంస్థ లాభాల్లో కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ అందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు విప్ స్పష్టం చేశారు.

అందులో భాగంగా వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ లీవ్, IIT, IIM లలో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికీ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, సింగరేణి ఏరియాలలో నివసించే వారికి పట్టాల పంపిణీ. ఉచిత విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్, సింగరేణి క్వార్టర్లు, డ్యూటీ లో చనిపోయిన కార్మికుడికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వంటి అనేక పథకాలు సింగరేణి కార్మికులకు అందించిన చరిత్ర ముఖ్యమంత్రి దని బాల్క సుమన్ తెలిపారు.

తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించి, ప్రైవేటీకరణ పేరుతో గనులను వేలం వేసి సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే పైశాచిక చర్యలు కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అకుంఠిత దీక్ష, పట్టుదలతో సంస్థను లాభాల బాట పట్టించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికలోకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like