ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్
ప్రయాణికులకు స్వల్ప గాయాలు
RTC bus, lorry hit by road accident: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయపల్లి వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఆసిఫాబాద్ నుండి మంచిర్యాల వెళ్తున్న బస్సు ఆసిఫాబాద్ వైపు లోడుతో వెళ్తున్న లారీ బోయపల్లి వద్ద ఢీకొనగా బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని పోలీసులు తెలిపారు.
లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతను తాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. 2 రోజుల క్రితం ఇదే స్థలంలో ఘటన జరిగి ఒకరు మృతి చెందారు. పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.