రోడ్డు ప్రమాదంలో బీజేపీ యువనేత మృతి

BJP youth leader dies in road accident:
మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో బీజేపీ యువనేత మృతి చెందారు. మంచిర్యాల పట్టణ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ స్నేహితులతో కలిసి బొక్కలగుట్ట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో కారు ప్రమాదానికి గురైంది. క్వారీ రోడ్ నుండి బొక్కలగుట్ట వెళ్లే దారి మధ్యలో తిమ్మాపూర్ రోడ్డు వద్ద కారు పల్టీలు కొట్టింది. దీంతో అది పొదల్లోకి దూసుకువెళ్లింది. రాత్రి కావడంతో దానిని గుర్తించడం పోలీసులకు కష్టమైంది. సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు కుమారుడు. కృష్ణారావు సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.