ములాయం సింగ్ మృతి

Death of Mulayam Singh:ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సమాజ్ వాది పార్టీ అధికారికంగా ప్రకటించింది.
కొన్ని రోజులుగా గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న ములాయం, ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. శ్వాస కోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ములాయం కిడ్నీ, యూరిన్ ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడ్డారు. ములాయం కేంద్ర రక్షణ మంత్రిగా, మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా సేవలు అందించారు.