ఇద్దరు దొంగలను పట్టుకున్న ప్రజలు
People who caught two thieves: కాగజ్‌నగర్ లో ఇద్దరు దొంగలను పట్టుకున్న స్ధానికులు పోలీసులకు అప్పగించారు. మొదట కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ ఎఫ్ కాలనీలో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించడంతో తాను దొంగతనానికి వచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతన్ని స్తంభానికి కట్టేసిన ప్రజలు మరింత ఆరా తీయగా తనతో పాటు ఇంకో వ్యక్తి కూడా వచ్చినట్లు వెల్లడించారు. దీంతో ఇద్దరిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇద్దరూ తాము మహారాష్ట్ర నుంచి వచ్చామని ఒకసారి, దహెగాం మండలం కొత్మీర్ నుంచి వచ్చామని చెబుతున్నారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. కొద్దిరోజులుగా కాగజ్‌నగర్ ప్రాంతంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. అది వీరిద్దరి పనేనా..? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే విషయంలో పోలీసులు విచారణ చేపట్టారు.