విద్యుత్ షాక్ తో రైతు మృతి
Farmer dies due to electric shock: అటవీ జంతువుల కోసం పెట్టిన వైర్లు తగలడంతో ఓ రైతు మరనించాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన దుర్గం భూమరాజు (25) బుధవారం తన పొలం వద్దకు వెళ్ళాడు. పక్కన పొలాలకు చెందిన రైతులు అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చారు. భూమరాజు అది గమనించలేదు. దీంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని మృతుని తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.