బ్రేకింగ్.. మునుగోడులో ఉద్రిక్తత
Tension in Munugodu of Nalgonda district: నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. ఈ నేపథ్యంలో చందన అనే మహిళను భర్త హరికృష్ణ కొట్టి చంపారు. అయితే ఈ రోజు అక్కడ మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్‌లో తరలించేందుకు ప్రయత్నించారు. పోస్టుమార్టం తీసుకువెళ్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు మునుగోడులో ట్రాక్టర్ అడ్డుకున్నారు. భార్యను హత్య చేసిన హరికృష్ణ అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుని బంధువు కావడం గమనార్హం. మృతదేహం తరలించకుండా అడ్డుకోవడంతో మునుగోడు లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మృతురాలి బంధువులు, గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.