పిడుగు పాటుకు యువకుడి మృతి
A young man died due to lightning:చేనులో పిడగుపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తాండూరు మండలం బెజ్జాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
నర్సాపూర్ గ్రామపంచాయితీకి చెందిన మాడావి సుకుమార్ చేనులో ఎద్దులు మేపేందుకు వెళ్ళాడు. వర్షం పడుతుండటంతో చెట్టు కింద నిలబడ్డాడు. దీంతో ఆ చెట్టు పై పిడుగు పడింది. సుకుమార్ కి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.