రాళ్ల దాడిలో ఎస్ఐకి గాయాలు
si-injured-in-stone-attack: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి రాళ్ల దాడికి దారి తీయగా ఆ దాడిలో ఎస్ఐ, పలువురు పోలీసులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధి బుజిలాపురంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్మాపురం వద్ద గ్రామస్తులు ఆందోళన నిర్వహించి, ధర్నా చేశారు. మృతదేహాన్ని రాములమ్మ అనే మహిళ ఇంట్లో వేసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుని బందువులు గ్రామస్థులు పోలీసులపై రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో
మోత్కూర్ ఎస్సై జానకి రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి.