సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలి
A minimum pension of Rs.15 thousand should be paid to Singareni retired workers: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలని పలువురు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రవీందర్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పల్లాస్, సాంబగౌడ్, గంగయ్య, రాజయ్య, యాదగిరి శుక్రవారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్థ సీఅండ్ఎండీకి ఉత్తరాలు పంపించారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ సంస్థలో 30-40 సంవత్సరాలు అహర్నిశులు కష్టపడి సంస్థను కాపాడడంలోనూ, సంస్థ అభివృద్ధి చెందడంలోనూ, లాభాలు తేవడంలోనూ రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమన్నారు. వారిని విస్మరించడం తగదని ఆందోళన వ్యక్తం చేశారు. 1993 సంవత్సరంలో సింగరేణి సంస్థ నష్టాలలో ఉండి బి.ఐ.ఎఫ్.ఆర్ వెళ్ళినప్పుడు సంస్థను తిరిగి మరల లాభాలలోకి తేవడంలో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమన్నారు. కానీ ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కొందరు కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా కూల్ మైండ్స్ పెన్షన్ పథకం 1998ని సవరణ చేసి కనీస పెన్షన్ 15,000 ఇవ్వాలన్నారు. అలాగే పెన్షన్ నిబంధనలో సవరణ చేసి ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెన్షన్ పెంచాలని కోరారు. అలాగే కార్పొరేట్ ఆస్పత్రుల్లో రిటైర్మెంట్ కార్మికులకు మెడికల్ సౌకర్యం, సొంత ఇల్లు లేని రిటైర్మెంట్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లు రిటైర్మెంట్ కార్మికులకు ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో వ్యసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిల్లా నర్సయ్య,AISF జిల్లా ఉపాధ్యక్షుడు పుదారి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.