నా స్నేహితుడికి మరణం లేదు..
స్నేహానికి అర్థం చెప్పిన హీరో విశాల్
స్నేహం అంటే సంతోషాలు, కష్టాలు కన్నీళ్లు పంచుకోవడం.. కానీ హీరో విశాల్ స్నేహానికి మరో నిర్వచనం చెప్పారు. తన స్నేహితుడు పునీత్ రాజకుమార్ మరణం తర్వాత ఆయన నిర్వహించే కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకున్నారు. ఆదివారం నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో తెలుగులో మాట్లాడడానికి కూడా రాని ప్రభుద్దులు మా వాళ్ళు. పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యత తానే తీసుకొంటున్నట్లు ప్రకటించారు. నా స్నేహితుడు పునీత్ పేరు మీదే దీనిని కొనసాగిస్తాను. నా స్నేహితుడికి మరణం లేదని నిరూపిస్తానని స్పష్టం చేశారు. కన్నడ హీరో పవర్ స్టార్ పునీత్ 46 ఉచిత విద్య పాఠశాలలు, 26 అనాధ ఆశ్రమాలు, 16 వృధాశ్రమాలు, 19 గో శాలలు నిర్వహించేవారు.