TBGKS ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అరెస్ట్
TBGKS general secretary Rajireddy arrested: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. మోడీ గో బ్యాక్ పేరుతో TBGKS నిరసనలు చేపట్టింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు TBGKS ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిని శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రామగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయనతో పాటు కొందరు నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని TBGKS నేతలు డిమాండ్ చేసారు.