బస్సు దగ్దం: తప్పిన పెను ప్రమాదం
Bus debacle: ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ లో మంటలు చెలరేగి దగ్దం అయింది. ప్రయాణికులు ముందుగానే దిగటంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపం లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూజా ట్రావెల్స్ కు చెందిన బస్సు నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చే సరికి ఆ బస్సులో షార్ట్ సర్క్యూట్ అయింది. బస్ లో పొగలు లేచాయి. దీనిని గమనించిన ప్రయాణికులు ముందుగానే బస్ లో నుండి దిగిపోయారు. తరువాత బస్సు దగ్దం అయింది. బసులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల కంటే ముందే ప్రయాణికులు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.