గని ప్రమాదంలో కార్మికుడికి గాయాలు
Worker injured in mine accident: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో గని ప్రమాదంలో కార్మికుడికి గాయాలయ్యాయి. ఎస్ఆర్‌పీ 3 గనిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కార్మికుడి కాలుకు తీవ్ర గాయాలయినట్లు తోటి కార్మికులు వెల్లడించారు. సోమవారం ఉదయం ఆసిఫ్ అనే కార్మికుడు గనిలో సైడ్ షిప్పింగ్ చేస్తున్నాడు. దీంతో సైడ్ ఫాల్ అయి అతని కాలికి తీవ్ర గాయమయ్యింది. దీంతో అతని సహచరులు హుటాహుటిన బీ జోన్ సింగరేణి ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ డాక్టర్లు కార్మికుడికి చికిత్స అందిస్తున్నారు.