కలెక్టరేట్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Man commits suicide in front of Collectorate: కొద్ది రోజులుగా నడుపుతున్న తన షాప్ కి అధికారులు తాళం వేయడంతో ఒక వ్యక్తి కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కుమ్మరి సంతోష్ అనే వ్యక్తి ఎంపీడీవో ఆఫీస్ సముదాయంలో షాప్ నడుపుతున్నారు. అయితే ఇది బినామీ షాప్ అని అధికారులు తాళం వేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో మంచిర్యాల కలెక్టరేట్ వచ్చిన సంతోష్ పెట్రోల్ పైన పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. సంతోష్ దగ్గర ఉన్న బాటిల్ లాక్కున్న పోలీస్ సిబ్బంది అతని పై నీళ్లు పోశారు.