అధికారులపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Minister KTR fire on officers: మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ఇచ్చిన హామీల అమలు విషయంలో ఒక్కటొక్కటిగా తెలుసుకున్న మంత్రి, మెస్ కాంట్రాక్టర్లను మార్చే విషయంలో అధికారుల ఉదాసీన వైఖరిపై సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు మెస్ కాంట్రాక్టర్లను మార్చకపోవడం ఏమిటని ఆయన వీసీని నిలదీశారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే మనమంతా ఉన్నది ఎందుకని అన్నారు. తాను మళ్లీ వచ్చేసరికి అంతా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ వీసీని ఆదేశించారు. ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం సందర్బంగా ఆయన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ట్రిపుల్ ఐటీకి వచ్చారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు.