ఎన్నిక‌ల‌కు రేవంత్ సైన్యం సిద్దం

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త క‌మిటీలు

New Committees for Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీలను నియ‌మించారు. ఈ మేర‌కు AICC ప్రకట‌న విడుద‌ల చేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి.. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురికి అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్‌లకు చోటు దక్కింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, వీహెచ్, పొన్నాల, శ్రీధర్ బాబు, మధుయాష్కీ గౌడ్, రాజనర్సింహ, రేణుకచౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన DCC అధ్యక్షులను ప్రకటించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను AICC ప్రకటించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like