విద్యార్థుల ఆకలికేకలు
Appetite of students: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా అది నీటి మూటలని తేలిపోతోంది. చాలా చోట్ల వారికి సరైన భోజనం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఆందోళనకు సైతం దిగుతున్న పరిస్థితి. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తుండటంతో వారు అస్వస్థతకు సైతం గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కేజీవీబీ పాఠశాల విద్యార్థులు ఆదివారం నిరసనకు దిగారు. తినే అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని పాఠశాల భవనం పైకి విద్యార్ధినిలు నిరసన తెలిపారు. మూడు రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు.. అన్నంలో పురుగులు రాళ్లు రావడంతో విద్యార్థులు అవస్థతకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని వెల్లడించారు.