బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
Four people died in a road accident: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు వాత పడగా.. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర లోని కిన్వాట్ గ్రామం నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న బైక్ ను తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన మనీషా(15), సంస్కార్ (11), తండ్రి మారుతి ( 40 ) మృతి చెందారు.. తల్లి వందనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.