గడప గడపకూ అభివృద్ధి ఫలాలు
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

MLA Nadipalli Diwakar Rao: దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వెల్లడించారు. ఆయన శుక్రవారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న సంక్షేమ ఫలాలు గడప గడపకూ చేరుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుంటే, ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తుందన్నారు. రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతుబంధు,రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు సరఫరా ఇలా అన్ని రకాల పథకాలు అమలు చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు.