సింగరేణి కార్మికుడు మృతి
Singareni worker dies: బెల్లంపల్లి పట్టణానికి ఆనుకుని ఉన్న కుంట రాములు బస్తీ ఏరియాలో ఉన్న వాగులో పడి ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. పోగుల సంతోష్ అనే కార్మికుడు శనివారం రాత్రి ఈ కుంటలో పడి మరణించాడు. సంతోష్ స్వస్థలం కొమురం భీమ్ జిల్లా రెబ్బన మండలం గోలేటి. అయితే అతని మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.