బైరి నరేష్ అరెస్టు
Bairi Naresh : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్‌లోని ఓ హోటల్లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని కొడంగల్ తరలించనున్నారు. అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నరేష్‌పై 16 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
బైరి నరేష్ పై 153ఏ, 285ఏ, 298, 505 సెక్షన్ల కింద కొండకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నరేష్ వీడియోలు పోస్టు చేయగా… సోషల్ మీడియా ద్వారా అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు నేడు వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.