సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రేడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్బ్యా క్ ఒచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటిని గుర్తించడం ఎలా? అలాంటి మోసాల బారిన పడకుండా ఏం చేయాలి? అనే వివరాలపై రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలో సైబర్ నేరాగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ మోసాల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు, వ్యక్తిగత డేటా కాజేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఉద్యోగాల ,క్రెడిట్ కార్డుల,బ్యాంక్ అకౌంట్ పిన్ చేంజ్ ,లాటరీల ,గిఫ్ట్ ల పేరుతో మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడటం ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఇస్తామని, భారీ ఆఫర్లు కూడా ఉన్నాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నారు.కొత్తగా క్రెడిట్ కార్డుకోసం ఎదురుచూస్తున్న వారికి కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న వారికి క్యాష్ బ్యాక్ వచ్చిందని నమ్మిస్తున్నారు ఆఫర్లలో ఆకర్షితులై నకిలీ ఫేస్బుక్ ఖాతాలో ఉండే సైట్ల ద్వారా ఎవరైనా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. వారికి సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తాయి. నిజమైన బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్గానే మాట్లాడి.. అవతలి వ్యక్తి నుంచి ఆధార్, పాన్ వివరాలు సహా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.ఇలా సేకరించిన సమాచారాన్ని డీప్ వెబ్‌లో అమ్మకానికి పెడ్డటం, కొత్త సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసి నేరాలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు. ఎవరైనా వివరాలు చెబితే వారి బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము కాజేస్తున్నారు అని సిపి అన్నారు
anydesk అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవద్దు.ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ ఐడి చెప్తే మీ ఫోన్ /లాప్ టాప్/కంప్యూటర్ సైబర్ నేరగాడి చేతిలోకి వెళ్ళినట్లే .
వాట్సప్ గ్రూపులలో వచ్చినటువంటి లింకులను ప్రెస్ చేయకండి ఎర్నింగ్ ఆప్స్ ని డౌన్లోడ్ చేసుకోవద్దు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు లోబడి ఉన్న బ్యాంకులలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.
KYC update చేసుకోవాలి అంటే నేరుగా సంబంధిత బ్యాంకు సంప్రదించగలరు. బ్యాంకు వారు గాని క్రెడిట్ కార్డు కు సంబంధించిన వారు గాని వాలెట్ కి సంబంధించిన వారు కానీ KYC వివరాల గురించి మిమ్మల్ని సంప్రదించారు.
PUBG గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయకూడదు. పిల్లల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు గమనించాలి. PUBG గేమ్ ఆడడం వలన చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త వహించాలి.
వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మరే ఇతర అ అప్లికేషన్లలో వచ్చిన లింకులను ప్రెస్ చేయకూడదు. గిఫ్ట్ కూపన్లను కొనుగోలు చేయకూడదు
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్‌లు ఎప్పుడూ కూడా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమకాదు.
మీ ఖాతాలో క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ జమ చేస్తామంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. అలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని మాటల్లో పెట్టి.. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయమన్నా, పిన్ ఎంటర్ చేయమని చెప్పినా, ఓటీపీలు అడిగినా చెప్పకూడదు. అలా ఎప్పుడైనా జరిగితే వెంటనే కాల్ కట్ చేసి.. ఫోన్ వచ్చిన నంబర్ పై ఫిర్యాదు చేయాలి అన్నారు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు…
1. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితునికి 3 లక్షల రపాయల లోన్ అప్రూవల్ అయింది అని మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి తన ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేయించుకున్నాడు. సైబర్ నేరగాడు బాధితునికి కాల్ చేసి మీకు లోన్ అమౌంట్ సాంక్షన్ కావాలి అంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం Rs. 5 వేలు పంపాలి అని చెప్పగా బాధితుడు పంపాడు. ఆ తరువాత మరొక Rs. 10 వేలు పంపండి ఇది రిఫండ్ అమౌంట్ మీ లోన్ అమౌంట్ తో పాటే తిరిగి పంపిస్తాము అని చెప్పగా బాధితుడు పంపాడు. ఇలా పలు దఫాలుగా బాధితుడు RS. 45 వేలు పోగొట్టుకున్నాడు.
2. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితురాలు తన SBI క్రెడిట్ కార్డు లో ఉన్న 4 వేల రివార్డ్ పాయింట్ల గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో SBI కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేసింది. సైబర్ నేరగాడు బాధితురాలితో మీయొక్క రివార్డు పాయింట్లు క్యాష్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే మీరు “ANY DESK” అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పగా బాధితురాలు చేసుకునీ యాక్సెస్ ఐడిని నేర గాడికి చెప్పింది. ఆ తరువాత తన క్రెడిట్ కార్డు యొక్క డీటెయిల్స్ సైబర్ నేరగాడి కి షేర్ చేసింది. అందులో వచ్చిన OTP ని సైబర్ నేరగాడు ANY DESK అప్లికేషన్ ద్వారా చూసి Rs. 7910/- మోసం చేశాడు.
3. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి మీయొక్క SBI YONO ACCOUNT బ్లాక్ అవుతుంది వెంటనే పాన్ కార్డు డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి అని మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి పాన్ కార్డు డీటెయిల్స్ సబ్మిట్ చేశాడు, OTP & MPIN ని కూడా సబ్మిట్ చేశాడు. 20% update పూర్తి అయ్యింది మొత్తం కావాలి అంటే మరొక OTP ఎంటర్ చేయాలి అని చెప్పగా బాధితుడు తాను రిసీవ్ చేసుకున్న మరొక OTP ఎంటర్ చేశాడు, వెంటనే బాధితుడు అకౌంట్ నుంచి RS. 11 వేలు డెబిట్ అయాయి.
4. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడుకి పార్ట్ టైం జాబ్ గురించి మెసేజ్ వచ్చింది, బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసిన వెంటనే సైబర్ నేరగాడి వాట్సాప్ చాట్ బాక్స్ ఓపెన్ అయింది. సైబర్ నేరగాడు బాధితుడి తో మేము మీకు ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి అందులో ఉన్న వస్తువులను ఆర్డర్ చేయాలి, తరువాత మీరు ఆర్డర్ చేసిన అమౌంట్ తో పాటు కమీషన్ కూడా కలిపి మీకు రిటన్ చేస్తాను అని చెప్పాడు. మొదట బాధితుడు చిన్న మొత్తాల తో వస్తువులను కొన్నాడు, సైబర్ నేరగాడు కమిషన్ తో కలిపి అమౌంట్ రిటర్న్ చేశాడు. పూర్తిగా నమ్మిన బాధితుడు Rs 5 లక్షలతో పలు ఆర్డర్ లు చేశాడు, కానీ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదరట్లేదు. సైబర్ నేరగాళ్లు బాధితులతో మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అంటే ఇంకొన్ని ఆర్డర్లు చెయ్యాలి అంటూ మోసం చేస్తున్నాడు.
5. గోదావరిఖని 2 టౌన్ పరిధిలోని ఒక బాధితుడు ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలి అనుకుని గూగుల్‌లో వెతికాడు. Renolt motors అనే పేజీని ఓపెన్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేశాడు. సైబర్ నేరగాళ్లు బాధితులతో ముందు అడ్వాన్స్ బుకింగ్ కోసం Rs. 20 వేలు పే చెయ్యాలి, ఆ తరువాత బైకుని మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము, బైకు రిసీవ్ చేసుకున్నాక మొత్తం అమౌంట్ సెండ్ చేయండి అని చెప్పగా, బాధితుడు ఆ డబ్బుని పంపించాడు. సైబర్ నేరగాడు మరలా బాధితునికి కాల్ చేసి చలానా కోసం మరొక Rs. 35 వేలు పంపండి, అప్పుడే బైకు ట్రాన్స్పోర్ట్ చేయడం కుదురుతుంది అంటూ మోసం చేస్తున్నాడు.
6. మంచిర్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితురాలి ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫోటోలని సైబర్ నేరగాడు మరొక ఇంస్టాగ్రామ్ అకౌంట్, వేరొక పేరు తో క్రియేట్ చేసుకుని, బాధితురాలి ఫొటోస్ అన్ని ఈ ఫేక్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నాడు.
7. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు BAJAJ FINSERVE LOAN అప్లికేషన్లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోగా ఎలిజిబుల్ కాదు అని వచ్చింది. మరుసటి రోజు సైబర్ నేరగాడు బాధితుడికి కాల్ చేసి మీకు Rs. 2 లక్షల లోన్ అప్రూవల్ అయింది అని చెప్పి, ఫేక్ లోన్ అప్రూవల్ లెటర్ ని పంపాడు. మీకు లోన్ అమౌంట్ సాంక్షన్ చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీ కోసం ర. 1550/- పంపాలి అని అడగగా బాధితుడు పంపాడు. సైబర్ నేరగాడు మరలా కాల్ చేసి, ఇంకా కొంచెం అమౌంట్ పంపండి, 5 నిమిషాలలో లోన్ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పగా బాధితుడు పలు దఫాలుగా Rs. 7998/- పంపాడు. ఆ తరువాత మరలా కాల్ చేసి మరొక Rs. 7200 పంపండి అంటూ వల విసురుతున్నారు.
మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితునికి ఇంస్టాగ్రామ్ లో “tradeavinash” ID నుంచి మీరు మాకు కొంచెం అమౌంట్ సెండ్ చేయండి మేము ట్రేడింగ్ చేసి కొద్దిసేపట్లోనే మీకు కమిషన్ తో కలిపి అమౌంట్ రిటర్న్ చేస్తాను అని మెసేజ్ వచ్చింది. సైబర్ నేరగాడి మాటలను నమ్మిన బాధితుడు పలు దఫాలుగా Rs. 1,03,000/- అతనికి పంపాడు. బాధితుడు తన అమౌంటు తనకి రిటర్న్ చేయాలి అని అడగగా మీరు కొంచెం అమౌంట్ పంపండి మొత్తం అమౌంట్ కలిపి ఒకేసారి సెండ్ చేస్తాను అంటూ మోసం చేస్తున్నాడని కమిషనర్ స్పష్టం చేశారు.