తల్వార్‌తో మంత్రి కేక్ కటింగ్..
Minister Indhrakaran Reddy: పుట్టిన రోజు కేక్ కటింగ్ అంటే చిన్నకత్తితో కోసి వాటిని పంచుతారు. అయితే, ఇదంతా సామాన్యుల పుట్టిన రోజుకి. మరి మంత్రి పుట్టిన రోజు కేక్ కటింగ్ అంటే ఎట్లుండాలే.. ఖచ్చితంగా సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండాలి. అందుకే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తన పుట్టిన రోజు కేక్ ఏకంగా తల్వార్‌తో కట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్‌లో గురువారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి జన్మదినం సందర్భంగా అభిమానులు తల్వార్ బహుకరించారు. ఈ తల్వార్తోనే మంత్రి కేక్ కట్ చేశారు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి కి నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి అల్లోల క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి అభిమానులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.