కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Manchiryal: సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి సమీకృత కలెక్టరేట్ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయడంతో పాటు ఒకే చోట అందించే విధంగా ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. భవనంలో వివిధ శాఖలకు కేటాయించిన గదులు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం సంబంధిత అన్ని పనులు త్వరగా పూర్తిచేసేందుకు గుత్తేదారు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.