పోలీసులను ‘ఏంట్రా’ అన్న యం.ఎల్.ఏ గువ్వల బాలరాజు
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి ఏం బాలేనట్టు ఉంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో రాజీనామా చేస్తామన్న విషయం ఆయనకు చికాకు తెప్పించింది. దానినుంచి బయటపడక ముందే ఆదివారం మరో వివాదం ఆయను చుట్టుముట్టింది. పోలీసులతో గొడవ పెట్టుకున్న ఆయన ఏంట్రా అనడం, అది సోషల్ మీడియాలో వైరస్ కావడంతో ఆయనకు తలవంపులు తెచ్చి పెట్టింది. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం మహబూబ్ నగర్ చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు సందర్భంగా ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం వాహనం అనుమతి కేసీఆర్ కు మాత్రమే ఉంది..మిగిలిన యం.ఎల్.ఏ లు..మంత్రులు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతం లో పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాలి.. అందరు నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు.. కానీ యం.ఎల్.ఏ గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.. పోలీసులు మాత్రం నిబంధనలు కు విరుద్ధంగా వ్యవహరించం అని మర్యాదపూర్వకంగా చెప్పడం తో గువ్వల బాలరాజు నిస్సహాయ స్థితిలో ఉండి పోలీసు అధికారులను ఏంట్రా అని నోరు జారారు. అంతే పోలీసు అధికారులు యం.ఎల్.ఏ బాలరాజుకు ఏంట్రా అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ చుక్కలు చూపారు.. తర్వాత బాలరాజు చేసేది ఏమి లేక తన అనుచరుల తో కాలి నడకన సమాధి వద్దకు చేరుకున్నారు..