ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. ఒకరి మృతి..
ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
BRS Spirit Society: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. టపాసులు పేలుస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న పూరిగుడిసె పై బాంబులు పడ్డాయి. ఇంటిపై నిప్పుపడి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.కాళ్లు, చేతులు తెగిపడటంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.