జ్వరంతో హాస్టల్ విద్యార్థిని మృతి
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అని ఆరోపణలు
Komuram Bhim Asifabad District: కొమురంభీమ్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థిని మృతి చెందారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో శ్రీవాణి అనే విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. వెన్నునొప్పి అని చెప్పడంతో సిర్పూర్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ ఆసుపత్రికి పంపించారు. శ్రీవాణి మార్గమధ్యంలో మరణించినట్లు కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ విద్యావతి నిర్ధారించారు.రెండు రోజుల నుండి జ్వరం, వెన్నునొప్పితో శ్రీవాణి బాధపడుతున్నా పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయని వెల్లడించారు. చనిపోయిన విద్యార్థి శ్రీవాణి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు.