ఆర్టీసీ బస్టాండ్ లో అగ్ని ప్రమాదం
Fire Accident: ఆర్టీసీ బస్టాండ్లోని ఓ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా(Komurambhim Asifabad District) కౌటాల ఆర్టీసీ బస్టాండ్లోని ఓ షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం షాపులో నుంచి మంటలు వస్తుండటం గమనించిన పలువురు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో వినోద్ జైస్వాల్ అనే వ్యక్తి షాపు దగ్ధం అయ్యింది. రూ. 35 వేల నగదు సహా వస్తువులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది.