తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ పోస్టర్ల ఆవిష్కరణ
హైదరాబాద్‌లో విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud: ఈ నెల 29,30 తేదీల్లో నిర్వహించే తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023 పోటీల వాల్ పోస్టర్లను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి ఆవిష్కరించిన మంత్రి పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని FCI ఫంక్షన్ హాల్ లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో నేషనల్ టీమ్ సెలక్షన్స్ నిర్వహిస్తారన్నారు. పోటీలు అన్ని వయసుల కేటగిరీల పురుషులు&స్త్రీల విభాగంలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కిక్-బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, జాయింట్ సెక్రటరీ శేఖర్, మంచిర్యాల జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు S.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి M.శ్రీలత, శివకృష్ణ, రాజు, స్వస్తిక్, ధన్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.