కల్లుగీత కార్మికుల కష్టాలు తీరుస్తాం
CLP leader Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికుల కష్టాలు తీరుస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేటలో కల్లుగీత కార్మికుల కష్టాలు, ఇబ్బందుల గురించి భట్టి విక్రమార్క తెలుసుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని, చెప్పింది ఏది చేయడం లేదని కల్లుగీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిందని, ఇప్పుడు ఏమి చేయడం లేదని పలువురు భట్టి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో భట్టి వారితో మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు మీరు కోరుకునే సంక్షేమ పథకాలు అన్ని అమలవుతాయని వారికి హామీ ఇచ్చారు.