బీజేపీలో బయటపడ్డ అంతర్గత కుమ్ములాట
కేంద్రమంత్రి ముందే ప్రొటోకాల్ రగడ
Bharatiya Janata Party: సాక్షాత్తూ కేంద్రమంత్రి ఎదురుగా బీజేపీ గ్రూపు విబేధాలు బయటపడ్డాయి. ఆయన ఎదురుగానే కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. బెల్లంపల్లికే చెందిన నేత కొయ్యల హేమాజీని స్టేజీ పైకి ఎక్కించినందుకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి పదవి లేదని ప్రొటోకాల్ లేకుండా హేమాజీని స్టేజీ పైకి ఎలా ఎక్కిస్తారని దుయ్యబట్టారు. దీంతో హేమజీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని చెప్పడంతో వాగ్వావాదం సాగింది. కేంద్రమంత్రి సాక్షిగా వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పట్టణ అధ్యక్షున్ని బుజ్జగించే ప్రయత్నం చేసినా వినలేదు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ తన అనుచరులతో సమావేశం బహిష్కరించారు.