పోగొట్టుకున్న సెల్ఫోన్ల అందచేత
-CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోండి
-రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి
Ramagundam Police Commissionerate:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న ఐదు ఫోన్లను కమిషనర్ రెమారాజేశ్వరి అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ రెమారాజేశ్వరి మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR PORTAL ద్వారా ఆ నెంబర్ www.ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలన్నారు. అలా చేస్తే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకుంటామని వెల్లడించారు. ప్రజలు ఈ CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఐదుగురు తాము పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి వివరాలు CEIR PORTAL నమోదు చేశారు. ఆ మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసి ట్రెస్డ్ డీటైల్స్ లోకి వెళ్లి వారి మొబైల్స్ లో SIM వేసిన వారి వివరాలు తెలుసుకొని ఆ వివరాలు రామగుండం సైబర్ క్రైమ్ కి అందించారు. వారు ఈ మొబైల్స్ రికవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లను కమిషనర్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు..
కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్,పెద్దపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్,జైపూర్ ఏసీపీ నరేందర్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య తదితరులు పాల్గొన్నారు.