న‌న్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

-పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య
-అదుపులోకి తీసుకున్న విచారిస్తున్న పోలీసులు

Durgam Chinnayya: ఓ వ్య‌క్తి ఏకంగా ఎమ్మెల్యేనే బ్లాక్ మెయిల్ చేశాడు. డ‌బ్బులు డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా, నీకు సంబంధించిన వీడియోలు సైతం బ‌య‌ట‌పెడ‌తానంటూ మెసేజ్లు చేశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. వివరాల్లోకి వెళితే..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండ‌లానికి చెందిన ఎండీ ఇసాక్ అనే వ్య‌క్తి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టాడు. నీకు సంబంధించిన వీడియోలు నా ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, వాటిని సోష‌ల్ మీడియాలో పెడ‌తామ‌ని బెదిరించాడు. ప్రగతి భవన్ వెళ్లి మీ వీడియోలు చూపిస్తామ‌ని మెసేజ్‌లో పేర్కొన్నాడు. త‌న‌కు రూ.90,0000 పంపితే వాటిని బ‌య‌ట‌పెట్ట‌మ‌ని, సైలెంట్గా ఉంటామ‌ని ఏకంగా ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌నే బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విచార‌ణ‌లో అత‌డు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండ‌లానికి చెందిన ఎండీ ఇసాక్ గా గుర్తించారు. అత‌న్ని ప‌ట్టుకుని కేసు న‌మోదు చేశారు. యువకుడి వెనుక ఎవరన్న ఉన్నారా..? వేరే వారి ప్రోత్సాహం, సహకారం ఉన్నదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 384సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ రోజు సాయంత్రం ఆ యువకున్ని బెల్లంపల్లి కోర్ట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like