రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం
Road Accident: మామిడిలోడుతో వెళ్తున్న వాహనం ఎదురుగా లారీని ఢీకొట్టడంతో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో బుట్టి వద్ద జరిగిన ప్రమాదంలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లికి చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే… నెన్నల మండలం చిత్తాపూర్‌కు చెందిన ఓ రైతు తన మామిడి పంటను బోలెరో వాహనంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్ తీసుకువెళ్లాడు. వెళ్తూ మధ్యలో తాండూరు మండలం బోయపల్లి వద్ద తన బామ్మర్తి రాదండి మల్లేష్(28)ను సైతం తోడుగా తీసుకువెళ్లాడు. ఈ రోజు ఉదయం నిద్రమత్తులో డ్రైవర్ ఆగి ఉన్న లారీ ఢీకొట్టాడు. దీంతో వాహనంలో ఉన్న రాదండి మల్లేష్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మల్లేష్ తన ఊరిలోనే చాకలి వృత్తి నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనలో రైతుతో పాటు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.