రాష్ట్ర గీత కార్మిక సహకార సంస్థ చైర్మన్‌గా పల్లె రవికుమార్

Palle Ravikumar:రాష్ట్ర గీత కార్మిక సహకార సంస్థ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ గౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో పల్లె రవి కుమార్ రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
పల్లె రవికుమార్ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, సోదరుడు వామపక్ష ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటులో పల్లె రవికుమార్ ముఖ్య భూమిక పోషించారు.
పల్లె రవికుమార్ మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాగా, ఆ నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు మంత్రి కేటీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గీత కార్మిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.